Tuesday, May 7, 2024
- Advertisement -

బిత్తిరి సత్తి డిమాండ్.. మేల్ డామినేషన్ : బిగ్ బాస్ శివజ్యోతి

- Advertisement -

ప్రముఖ న్యూస్ చానె లో సావిత్రిగా బాగా పాపులర్ అయింది శివజ్యోతి. ఆమె యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంత క్రేజ్ ఉన్న ఈమెను వెతుకుంటూ బిగ్ బాస్ 3 ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె బిగ్ బాస్ లో చాలా రోజులు ఉన్న తర్వాత గత వారం ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా పలు టీవీ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొస్తోంది. బిత్తిరి సత్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

తామిద్దరం అన్నా చెల్లెల కలిసి ఉండేవాళ్లమని.. తెరపై అక్కా తమ్ముళ్లము అయినా మీము.. నిజ జీవితంలో మాత్రం అన్నా చెల్లలా ఉంటామని చెప్పింది. బిత్తిరి సత్తి ఏం చేసినా నా అభిప్రాయం తెలుసుకుంటారని అంతా నమ్మకం తనపై ఉండేది అని చెప్పింది. అంతేకాదు బిగ్ బాస్ కి వెళ్తాను అంటే బిత్తిరి సత్తి వద్దని చెప్పాడని తెలిపింది. కానీ ఏదైనా సాధించాలనే కసితో బిగ్ బాస్ షోకి వెళ్లానని.. కానీ వెళ్లేముందు మాత్రం సత్తికి చెప్పలేదని తెలిపింది. నా కెరీర్ ఎలా సాగుతుందనేది చెప్పాలేను. ఒక వేళ కెరీర్ ఎండ్ అవుతే.. భర్త పిల్లలతో సుఖంగా ఉంటానని చెప్పింది.

అంతేకాదు.. వీ6 ఛానెల్ సీఈవో వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. వాళ్లే నాకు సావిత్రి అని పేరు పెట్టారు. ఇండస్ట్రీలో ఎప్పుడు మేల్ డామినేషన్ ఉంటుందని చెప్పింది. తనకంటే బిత్తిరి సత్తికి ఎక్కువ పారితోషం ఇచ్చేవారని వెల్లడించింది. ఆయనకు ఆ స్థాయి డిమాండ్ ఉంది కాబట్టి ఇచ్చేవారని.. సత్తి చాలా ఆశలతో టాలీవుడ్ లోకి వచ్చారని.. ఆయన అక్కడ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు సావిత్రి తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -