Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్ కి 50 లక్షలు.. శ్రీముఖి తప్పు ఇదే..!

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. అందరు ఊహించినట్లే టైటిల్ ని రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. దాదాపు మూడు నెలలకు పైగా హౌస్ లో ఎన్నో జరిగాయి. మొత్తానికి రాహుల్ విజేతగా ట్రోపీతో పాటుగా 50 లక్షలు గెల్చుకున్నాడు. రాహుల్ కు 8.52 కోట్ల మంది ఓటు వేసారు. ఇక ఈ ట్రోఫీని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రాహుల్ అందుకున్నాడు. ఈ సీజన్ లో శ్రీముఖి రన్నర్ గా నిలిచారు.

“బిగ్ బాస్ గ్రేట్ షో.. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఈ షో ని అభిమానించే వారు కోట్లలో ఉంటారు. ఈ షోకి నన్ను పిలవడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ విషయంలో నా మిత్రుడు నాగార్జునకు థ్యాంక్స్ చెప్పుకోవాలి” అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇక తాను టైటిల్ గెలిచినా గెలవక పోయిన తన తల్లి దండ్రులకు ఓ ఇల్లు కొంటానను అని రాహుల్ చెప్పాడు. అయితే అతను టైటిల్ గెలవడంతో 50 లక్షలు సొంతం చేసుకున్నాడు. మరి రాహుల్ తనకు నచ్చిన ప్లేస్ లో ఇల్లు కొనాలంటే ఈ డబ్బు సరిపోతుంది.

ఈ విషయం లో రాహుల్ తల్లిదండ్రులు చాలా సంతోష పడ్డారు. ఇక శ్రీముఖికి బిగ్ బాస్ యాజమాన్యం బాగా హెల్ప్ చేసినప్పటికీ ఆమె గెలవకపోవడానికి కారణం ఆమె రాహుల్ విషయం లో చూపించిన ఓవర్ యాక్షన్ అని తెలుస్తోంది. రాహుల్ విషయం లో శ్రీముఖి ఎప్పుడు కోపంగా ఉండేది. రాహుల్ ఏదైనా టాస్క్ గెలిస్తే మొహం మార్చుకునేది. ఆలా చేయడం వల్లే శ్రీముఖికి అంటే తక్కువ క్రేజ్ ఉన్న రాహుల్ కి సింపతీ పెరిగి ఎక్కువ ఓట్లు పడి గెలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -