Friday, May 9, 2025
- Advertisement -

బిగ్ బాస్ షో…… మళ్ళీ మళ్ళీ ఎన్టీఆరే

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమాతో క్లాస్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్….. బిగ్ బాస్ షోతో ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా చాలానే ఆకట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్‌తో ఎన్టీఆర్ అనుబంధం ఒక్కసారికే అయిపోయిందని…….. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ కనిపించడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై స్టార్ మా వాళ్ళను అడిగితే వాళ్ళు సరికొత్త సంగతులు చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ యాంకర్‌గా ఎన్టీఆర్‌తో భారీ ఒప్పందం చేసుకున్నారు స్టార్ మా వాళ్ళు. అయితే ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆ తర్వాత రాజమౌళితో భారీ సినిమా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఖాళీగా లేడు. అందుకే ఈ రెండో సిరీస్ కి మాత్రం ఎన్టీఆర్ డేట్స్ ఖాళీ లేక అందుబాటులో ఉండడం లేదు. అదే విషయాన్ని స్టార్ మా వాళ్ళకు ఎన్టీఆర్ చెప్పాడు. అందుకే స్టార్ మా వాళ్ళు ఈ ఒక్క సిరీస్ కి మాత్రం నానీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచీ మాత్రం మళ్ళీ మళ్ళీ ఎన్టీఆరే వరుస సిరీస్‌లలో అలరిస్తాడట. స్టార్ మా తో ఎన్టీఆర్‌కి లాంగ్ టైం ఒప్పందం ఉందని….. ఐపీఎల్‌తో ఒప్పందం కూడా అందులో భాగమేనని స్టార్ మా వాళ్ళు తాజాగా చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -