Monday, April 29, 2024
- Advertisement -

సహకరిస్తేనే వాడుకుంటారు.. క్యాస్టింగ్ కౌచ్‌పై భానుశ్రీ

- Advertisement -

తెలుగుమ్మాయి భానుశ్రీ సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్ లో హీరోయిన్ గా సెటిలయ్యారు. బాహుబలి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో చిన్న రోల్ చేసింది భానుశ్రీ. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్లి బాగా ఫాపులారిటీ తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.

తాజాగా ఆమె తనకు ఎదురైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏడు చేపల కథలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా జోడించారని.. తనకు చెప్పిన కథ ఒకటి.. సినిమాలో చూపించింది ఒకటి అని అన్నారు. సినిమాలో తనదే ప్రధాన పాత్ర అని.. టెంఫ్ట్ రవిది చిన్న క్యారెక్టర్ అని చెప్పారని.. ఇక సినిమాలో సూపరు 25 నిమిషాల పాటు అడల్ట్ కంటెంట్ ను సెన్సార్ బోర్డు కట్ చేసిందని తెలిపింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో ఖాళీగానే ఉన్నానని.. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరు నెలల వరకు ఎక్కడ పనిచేయకూడదని బిగ్ బాస్ వాళ్లు కండిషన్ పెట్టారని.. అయితే అది తనకు మొదట్లో చెప్పాలేదని వెల్లడించింది.

అప్పటికే ఢీ షోలో ఐదు ఎపిసోడులు చేసిన తర్వాత మా టీవీ వాళ్లు డైరెక్ట్‌గా ఈటీవీతో కాంటాక్ట్ అయ్యి తనను తీయించేశారని తెలిపింది. తాను పాల్గొన్న బిగ్ బాస్ సీజన్ లో కమిట్మెంట్ గురించి అడగలేదని.. కాకపోతే మూడో సీజన్ లో మాత్రం కమిట్మెంట్ గురించి అడిగారు అని విన్నాను. మొదటి సీజన్ లో కూడా ఇలాంటివి వినలేదు. మరి మూడో సీజన్ లో ఈ ఆరుపణలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదని చెప్పింది.

ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఇది బలవంతంగా ఏమీ జరగదని.. వీళ్లు సహకరిస్తేనే వాళ్లు ఏమైనా చేయగలరని.. లేకపోతే వాళ్లేమీ చేయలేరని భానుశ్రీ అభిప్రాయపడ్డారు. రెండు చేతులు కలిపితేనే చప్పట్లని.. అలాగే ఇద్దరు మనుషుల మధ్య అంగీకారం ఉంటేనే అలాంటివి జరుగుతాయని భానుశ్రీ అన్నారు. అవకాశాల కోసం వెళ్తున్నప్పుడు మనకు రెండు దారులు ఉంటాయి.. మనం మంచి దారిలో వెళ్లడం మంచిదని ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -