Saturday, May 4, 2024
- Advertisement -

షోలో వేధింపులు.. మ‌హిళా క‌మిష‌న్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

- Advertisement -

బిగ్‌బాస్‌.. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రూపొందించిన ఈ కార్య‌క్ర‌మం చాలా రాష్ట్రాల్లో కాంట్ర‌వ‌ర్సితోనే హైలేట్ అయ్యింద‌ని చెప్పుకోవాలి. షోలో తిట్టుకోటుకోవ‌డం.. అవ‌స‌ర‌మైతే కొట్టుకోవ‌డం చూశాం. టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం వారే ఇలా ప్రొగ్రామ్‌ను డిజైన్ చేస్తార‌నుకుంటాం.. కానీ కొన్ని సార్లు ఆ గొడ‌వ‌లు నిజ‌మైన‌వే అని రుజువ‌వుతావుంటాయి.

కన్నడ బిగ్ బాస్ పోటీల్లో పాల్గొని, మధ్యలోనే బయటకు వచ్చేసిన కవితా గౌడ, తన సహ కంటెస్టెంట్ యాండీపై సంచలన విమర్శలు చేసింది. అక్క‌డితో ఆగ‌కుండా హౌస్ లో యాండీ తనను లైంగికంగా హింసించాడని ఆరోపిస్తూ, ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం ఇది హాట్‌టాపిక్ అయ్యింది.

షోలో జరిగిన వేధింపుల గురించి కార్యక్రమం నిర్మాత గురుదాస్ శణైకి ముందే చెప్పానని, తనకు జరిగిన అన్యాయంపై బయటకు వచ్చిన తరువాతనే నోరు విప్పుతున్నానని తెలిపింది. షోలో భాగంగా రెండు రోజుల పాటు ‘సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌’ టాస్క్‌ జరిగిన సమయంలో యాండీ త‌న‌పై లైంగిక వేధింపులకు దిగాడని ఆరోపించింది.

సీజ‌న్ 6లో క‌వితా మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే కవితా గౌడ ఆరోపణలను యాండీ తీవ్రంగా ఖండించాడు. బిగ్‌ బాస్‌ పోటీల తరువాత ఆమెను తాను కలవలేదని అన్నాడు. ఓటమిని తట్టుకోలేక కవిత తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -