Monday, May 20, 2024
- Advertisement -

రోల్ రైడా కన్నింగ్ గేమ్ బట్టబయలు

- Advertisement -

ఓర్నీ ఈ రోల్ రైడాగాడు మామూలోడు కాడు. వీడు ర్యాప్ లు గీప్ లు అంటూ తిరుగుతున్నాడు కానీ, ఇండస్ట్రీలో ట్రై చేసుంటే నెంబర్ వన్ నటుడు అయిపోయి ఉండేవాడు, వీడూ వీడి ఓవర్ యాక్టింగ్ ? ఇన్ని డ్రామాలు ఎక్కడ నేర్చుకున్నవ్ బిడ్డా ? అని బిగ్ బాస్ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. నేను మాటాడితే చాలు కుక్కల్లాగా పడిపోతున్నారు. అని ఉన్నమాటే కౌషల్ అంటే హౌస్ మేట్స్ అందరికీ పౌరుషం పొడుచుకొచ్చింది. గతంలో కుక్కలు మెురిగాయని మనం పట్టించుకుంటే మనం కూడా కుక్కలం అయిపోతాం. అంటూ భానుశ్రీ అన్నప్పుడు సామ్రాట్ వెర్రి చూపులు చూస్తూ కూర్చున్నాడు. తాను కూడా తోటి హౌస్ మేట్స్ ను పలు సందర్భాల్లో కుక్కలతో పోల్చాడు. గీతామాధురి భర్త నందు హౌస్ లోకి వచ్చినప్పుడు సామీ నువ్వు సామీ కాదురా టామీ అంటూ కుక్కపేరుతో పిలిచి ఎగతాళిగా మాట్లాడాడు. అప్పుడు కూడా సామ్రాట్ అదేదే పెద్ద కాంప్లిమెంట్ అన్నట్టు హ్యాపీగా ఫీలయ్యాడు. పైగా అనేక సందర్భాల్లో నేను గీతా నందు పెట్…అంటూ తనకు తానే చెప్పుకొచ్చాడు. కానీ అదే మాట కుక్కల్లా పడిపోతున్నారు…అని కౌషల్ అనేసరికి ఏరా ? ఏం మాట్లాడుతున్నావ్ రా అంటూ ఈ పొటుగాడు ఆవేషంతో ఊగిపోయాడు.

ఇక రోల్ రైడా అయితే నటనకు జీవం పోసేశాడు. ఏడుపులు, పెడబొబ్బలు, దొర్లి దొర్లి ఏడ్చేసి, కౌషల్ కాళ్లు మొక్కుతా…అంటూ ముక్కు చీదేసి, ముఖం మాడ్చేసి, మమ్మల్ని కుక్కలంటావా ? అంటూ అబ్బో…నటనలో జీవించేశాడు. అసలు వీడి ఓవరాక్షన్ ఏంట్రా బాబూ…అని ప్రేక్షకులు చీదరించుకునేలా నటించేేశాడు. మమ్మల్ని కుక్కలంటావా ? నా ఏడుపును యాక్టింగ్ అంటావా ? నేను ఇంత నిజాయతీగా బాధ పడుతూ ఏడుస్తుంటే…నీకు డ్రామాలా కనిపిస్తోందా ? నాకు భావోద్వేగాలు ఎక్కువ ? అందుకే ఏడుస్తున్నాను…అంటూ వీడి చెప్పిన సోది కబుర్లు, వేసిన డ్రామాలు చూసి జనం ఛీ…అంటూ ఉమ్మేశారు. కుక్కల్లాగా…అని కౌషల్ అన్నందుకు అంత ఓవర్ యాక్షన్ చేసేసిన రోల్ రైడా అసలు రంగు, అదే రోజు డైనింగ్ టేబుల్ వద్ద బట్టబయలైపోయింది.

ప్లేటులో పెట్టుకున్న అన్నంని వాసన చూస్తున్నప్పుడు…ఏంటి కుక్క లెక్క తయారవుతున్నావ్…కుక్క కూడా అలాగే తినేముందు వాసన చూస్తుంటుంది. అని తనిష్ అన్నప్పుడు ఈ రోల్ రైడాకి పౌరుషం రాలేదా ?. కౌషల్ అన్నప్పుడు పొడుచుకొచ్చిన కోపం, బాధ, తనీష్ అన్నప్పుడు ఎందుకు రాలేదో ? తనీష ఆ మాట అన్నప్పుడు కిక్కురుమనకుండా వెర్రి నవ్వులు నవ్వాడు కూడా. కౌషల్ మీద పడిపోయి రక్కేసిన సామ్రాట్, గీత, దీప్తి కూడా ఈ మాట అన్నప్పుడు చడీచప్పుడు లేకుండా బయట పడకుండా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఈ ఒక్క సీన్ చూస్తేనే అర్దమయిపోయింది వీళ్ల డ్రామాలు, వీళ్ల ఓవర్ యాక్షన్. ఓడిపోతున్నామని తెలిసే, కావాలనే కౌషల్ మీద పడి ఏడుస్తున్నారు. వాంటెడ్లీ అతడిని వేధిస్తున్నారు అని. ఈ దెబ్బతో రోల్ రైడా గాడి పని అయిపోంది…అంటూ కౌషల్ ఆర్మీయే కాదు బిగ్ బాస్ ప్రేక్షకులంతా వీడని ఛీదరించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -