Wednesday, May 1, 2024
- Advertisement -

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య.. బిగ్‌బాస్ విజేత‌గా కౌశ‌ల్‌

- Advertisement -

కౌశ‌ల్‌.. కౌశ‌ల్‌.. కౌశ‌ల్‌.. ఈ ప‌దం త‌ప్ప ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌రో మాట విన‌ప‌డ‌డం లేదు. కౌశ‌ల్ బిగ్బాస్ విజేత‌గా అధికారికంగా ఈ రోజు రాత్రికి ప్ర‌క‌టించ‌నున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికే అన‌ధికారికంగా కౌశ‌ల్ విన్న‌ర‌నే లీకు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలోని బిగ్‌బాస్ సెట్‌లో ఈరోజు తెల్ల‌వారుజామున నిర్వ‌హించిన బిగ్‌బాస్ ఫైన‌ల్ షో షూటింగ్‌లో కౌష‌ల్ విజేత‌గా నిలిచిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ షోకు హాజ‌రైన ప్ర‌త్య‌క్ష సాక్షులు ఇప్ప‌టికే ఈ విషయాన్ని బ‌య‌ట‌కు ప్ర‌క‌టించారు. బిగ్‌బాస్ లీకులు ఇవ్వ‌డంలో ముందుండే హారిక ఇన్న‌మూరి కూడా ఇప్ప‌టికే దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చేసింది.

బిగ్‌బాస్ షో ఫైన‌ల్స్లో అతిత‌క్కువ ఓట్ల‌తో తొలుత సామ్రాట్‌, త‌ర్వాత దీప్తి, త‌ర్వాత త‌నీష్ ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. సామ్రాట్ ఐదో స్థానంలో, దీప్తి న‌ల్ల‌మోతు నాలుగో స్థానంలో, త‌నీష్ మూడో స్థానంలో నిలిచారు. హౌస్‌లో కౌశ‌ల్ , గీతామాధురి మాత్ర‌మే మిగిలారు. వీరిద్ద‌రికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు ఉద‌యం తెల్ల‌వారుజామున జ‌రిగింది. దీనిలో ర‌న్న‌ర‌ప్‌గా గీతామాధురి.. విన్న‌ర్‌గా కౌశ‌ల్ నిలిచారు. ఐదుగురిలో మొద‌ట ముగ్గురిని ఒక్కొక్క‌రిని ఒక్కో ప‌ద్ధ‌తిలో హౌస్ నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. చివ‌రిగా హౌస్లో మిగిలిన ఇద్ద‌రినీ వేదిక‌పైకి తీసుకొచ్చి.. నాని, చీఫ్ గెస్ట్‌లు వారికి సంబంధించిన విష‌యాల‌ను మాట్లాడిన త‌ర్వాత‌.. బిగ్‌బాస్ షోకు స్పాన్ష‌ర్లుగా వ్య‌వ‌హ‌రించిన కె.ఎల్.ఎమ్ ఫ్యాస‌న్స్ వంటి సంస్థ‌లు ఇచ్చిన బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. త‌ర్వాత‌.. అత్యంత ఉత్కంఠ మ‌ధ్య విన్న‌ర్‌ను ప్ర‌క‌టించారు. చివ‌రిగా మిగిలిన ఇద్ద‌రినీ అటూ ఇటూ నిల‌బెట్టిన త‌ర్వాత విజేత చేతిని గాలిలోనికి నాని లేపాడు. కౌశ‌ల్ చేతిని పైకి లేప‌డంతో.. ఒక్క‌సారిగా గ్యాల‌రీలో ఎదురుగా కూర్చున్న వారి అరుపులు, కేక‌లు, చ‌ప్ప‌ట్ల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. త‌ర్వాత‌.. చీఫ్ గెస్ట్ చేతుల‌మీదుగా కౌశ‌ల్‌కు ట్రోఫీని అంద‌జేసి.. రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీని అంద‌జేస్తారు. కౌశ‌ల్ బిగ్‌బాస్ జ‌ర్నీ ఇక్క‌డితో ముగిసింది. ఒంట‌రి యోధుడిగా హౌస్‌లో కౌశ‌ల్ చేసిన సుదీర్ఘ పోరాటానికి.. ఫలితం ద‌క్కింది. కౌశ‌ల్‌ను అంతా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. అన్న‌పూర్ణ స్టూడియోలో బిగ్బాస్ ఆడిటోరియోం మొత్తం మారుమోగింది.

ఫైన‌ల్ షో షూటింగ్‌లో ఐదురుగు ఫైన‌లిస్టుల కుటుంబ స‌భ్యులు మొత్తం హాజ‌ర‌య్యారు. కౌశ‌ల్ భార్య నీలిమ‌, ఇద్ద‌రు పిల్ల‌లు, కౌశ‌ల్ తండ్రి, త‌నీష్ త‌ల్లి, త‌మ్ముడు, సామ్రాట్ త‌ల్లి, తండ్రి, మ‌రో బంధువు, దీప్తి న‌ల్ల‌మోతు త‌ల్లిదండ్రులు, భ‌ర్త శ్రీకాంత్, కుమారుడు, గీతామాధురి భ‌ర్త నందు, త‌ల్లిదండ్రులు హాజ‌ర‌య్యారు. వీరితో పాటూ ఇప్ప‌టికే హౌస్‌లోనికి ఎంట‌రై సంద‌డి చేసిన ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్‌లు ఒక్క నూత‌న్ నాయుడు త‌ప్ప‌.. అంద‌రూ హాజ‌ర‌య్యారు. ఈ షో ఆదివారం సాయంత్రం 6గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కాబోతోంది. దేశ‌విదేశాల్లో ఉన్న బిగ్బాస్ ప్రేక్ష‌కులు, కౌశ‌ల్ ఆర్మీ స‌భ్యులు.. ఆస‌క్తిగా ఎదుర‌చూస్తున్నారు. కౌశ‌ల్ విన్న‌ర‌నే విష‌యం ఇప్ప‌టికే ప్ర‌పంచ మంతా తెలిసిపోయింది.

ముందునుంచి కౌశ‌ల్ ఓటింగ్ విష‌యంలో మిగ‌తా వారితో పోలిస్తే.. మూడు రెట్లు అధికంగా సాధిస్తూనే ఉన్నాడు. దీంతో అంద‌రికీ విన్న‌ర్ ఎవ‌ర‌నే విష‌యంలో సందేహం లేదు. కౌశ‌ల్ విజేత‌గా ట్రోఫీని, అర‌కోటిని అందుకునే క్ష‌ణాన్ని చూసి త‌రించాల‌ని అత‌నికున్న అశేష అభిమాన ఘ‌నం ఎదురుచూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -