Friday, May 9, 2025
- Advertisement -

దీప్తికి క్లాస్ పికిన నాని

- Advertisement -

బిగ్‌బాస్ రియాల్టీ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.దీంతో ఎవ‌రు విన్న‌ర్‌గా నిలుస్తారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక శనివారం ఎపిసోడ్‌తో 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.కౌశల్ భార్యపై దీప్తి నిన్నటి ఎపిసోడ్ లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ భార్య అతడితో ఎలా వేగుతుందో అనే అర్ధం వచ్చే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నాని ఈ విషయంపై దీప్తికి చురకలు అంటించారు. హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు అభిప్రాయాలు చెప్పుకోవచ్చు కానీ పర్సనల్ విషయాల జోలికి పోవద్దని నేను మొదటి నుండి చెబుతున్నామని కానీ కౌశల్ భార్య గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దీప్తిని ప్రశ్నించారు.అయితే నేను ఆమె ఓపిక గురించి మాత్రమే అన్నానని తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది దీప్తి.

దీనికి కౌంటర్‌గా ఇలాంటి కామెంట్స్ మీపైన చేస్తే మీరు ఇలాగే స్పందిస్తారా? అంటూ నాని ప్రశ్నించారు.ప్లీజ్ షో బ‌య‌ట వారిపై ఎలాంటి కామెంట్స్ చేయ‌వ‌ద్ద‌ని చెప్పుకొచ్చాడు నాని. ఇక ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న దీప్తి, కౌశల్, అమిత్, శ్యామలలో ఎవరు సేఫ్ అయ్యారో రివీల్ చేస్తానంటూ బ్రేక్ తీసుకున్న నాని.. దీన్ని రేపటి ఎపిసోడ్‌కి వాయిదా వేశారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లోనే సేఫ్ అయ్యింది ఎవరు? ఎలిమినేట్ అయ్యిందెవరో తెలుసుకుందాం అంటూ కార్యక్రమాన్ని ముగించేశారు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -