Thursday, April 18, 2024
- Advertisement -

దీపావళి కి బయట నుంచి వెంకటేష్ కి పోటీ

- Advertisement -

సాధారణం గా విక్టరీ వెంకటేష్ ఎప్పుడు తన సినిమాలని కరెక్ట్ రిలీజ్ టైం చూసుకొనే విడుదల చేస్తారు. అంత తొందరగా ఏ హీరో తో కూడా క్లాష్ ఉండదు. పండుగ కి సినిమా విడుదల చేస్తే ఎలాగో పోటీ తప్పదు. ఇప్పుడు అది పక్కన పెడితే, ఈ సారి వెంకటేష్ తన సినిమా వెంకీ మామ ని దీపావళి పండుగ కి విడుదల చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సారి దీపావళి పండుగ కి పెద్ద సినిమాలు ఏమి రావడం లేదు కానీ తమిళ హీరో విజయ్ నటించనున్న బిగిల్ అనే సినిమా మాత్రం విడుదల అవుతుంది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అని అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే వెంకటేష్ కి ఈ సారి బయట నుంచి, అనగా తమిళ ఇండస్ట్రీ నుంచి పోటీ ఉండటమే కాస్త విచిత్రం గా ఉంది. రెండు సినిమాలు వేటికవే వినూత్నం గా ఉండనుంది. కాకపోతే ఎవరు పై చేయి సాధిస్తారు అనేది చూడాలి. ఈ సారి విజయ్ కూడా తన సినిమా ని తెలుగు లో తమిళ మార్కెట్ కి ధీటుగా ఉండేలా చూసుకుంటున్నాడు. మరి వెంకటేష్ పైన విజయ్ విజయం సాదిస్తాడా లేదా విక్టరీ ఎప్పటి లానే వెంకటేష్ ని వరిస్తుందా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -