- Advertisement -

ఉదయం 4 గంటలకే నిద్రలేస్తా.. ఆ ముచ్చట కేవలం 5 సెకన్లే!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో, ఖిలాడీ అక్షయ్ కుమార్ (Akshay Kumar) లీడ్ రోల్‌లో, ప్రముఖ దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ (Welcome to the Jungle). భారీ తారాగణంతో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముంబైలో అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ఈ వేడుకలో ప్రెస్ మీట్ సందర్భంగా ఒక విలేకరి.. “మీరు ఎప్పుడైనా మీ రిటైర్మెంట్ గురించి ఆలోచించారా?” అని అడగ్గా.. అక్షయ్ కుమార్ తనదైన శైలిలో నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రిటైర్మెంట్ ముచ్చటపై అక్షయ్ ఓపెన్‌గా మాట్లాడుతూ.. “రోజూ పొద్దున్నే నిద్రలేవగానే నాకు రిటైర్మెంట్ గురించిన ఆలోచన వస్తుంది. కానీ, అలా అనుకున్న సరిగ్గా ఐదు సెకన్లకే.. నాకు ఈరోజు షూటింగ్ ఉంది కదా, నా కోసం సెట్‌లో దాదాపు 300 మంది ఎదురుచూస్తుంటారు, నేను త్వరగా వెళ్లాలి అని గుర్తొస్తుంది. అంతే.. ఆ రిటైర్మెంట్ ఆలోచన కేవలం 5 సెకన్లలోనే మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకే నిద్రలేవగానే మళ్లీ అదే ఆలోచన వస్తుంది.. మళ్లీ ఐదు సెకన్లలో ఎగిరిపోతుంది. ఇలా రోజువారీ షెడ్యూల్స్ చూసుకుంటూనే నా కెరీర్‌లో ఏకంగా 36 ఏళ్లు గడిచిపోయాయి” అని నవ్వుతూ చెప్పారు. దాంతో హాల్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. ఎవరూ రిటైర్మెంట్ గురించి ఎక్కువగా చింతించకుండా.. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలని అక్షయ్ పిలుపునిచ్చారు.

ఇక సినిమా విశేషాల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ‘సినిమాలోనే సినిమా’ (Film-within-a-film) అనే ఒక వైవిధ్యమైన వినోదాత్మక బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ట్రైలర్‌లో చూసిన కామెడీ కేవలం రెండు శాతం మాత్రమేనని.. అసలైన ఫన్ అండ్ రైడ్ థియేటర్లలో సినిమా మొత్తం చూస్తేనే అర్థమవుతుందన్నారు. దర్శకుడు అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక కేవలం కొన్ని వారాల్లోనే పూర్తయిందని.. తాము ఒక్క ఫోన్ కాల్ చేయగానే బాలీవుడ్ ప్రముఖ స్టార్స్ అందరూ కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశారని గర్వంగా పంచుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -