టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేశ్ బాబు తెలుగులో తప్ప మరో భాషలో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. అయినప్పటికి మహేశ్ నేషనల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక మహేశ్ అంటే చాలు బాలీవుడ్ భామలు పిచ్చేక్కిపోతారు. బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో హీరోయిన్‌గా చేస్తే మహేశ్‌తోనే చేస్తామని చాలామంది తమ ఇంటర్య్వూలలో తెలిపారు.
అమ్మాయిల అందాన్ని సైతం డామినేట్ చేస్తాడు మహేశ్. తాజాగా మరో భామ మహేశ్‌తో సినిమాపై స్పందించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ మహేశ్‌తో సినిమా చేయనుందని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ,మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కత్రినను తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.తాజాగా దీనిపై స్పందించింది కత్రిన. ప్రస్తుతానికి మహేశ్ సినిమా గురించి ఎవరు నన్ను సంప్రదించలేదని,ఇవన్ని ఊట్టి రూమర్లే అని కొట్టిపారేసింది. అయితే మహేశ్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే కనుక వదులుకోనని తెలిపింది ఈ బాలీవుడ్ భామ.
మరి మహేశ్ కోసం సుకుమార్ కత్రినను తీసుకుంటాడో లేక ఎప్పటిలాగే కొత్త భామ కోసం తన వేటను కొనసాగిస్తాడో చూడాలి. మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.వంశీపైడపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తోంది. ఏప్రిల్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సుకుమార్ సినిమా మొదలుపెడతాడు మహేశ్.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!