దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. సినిమా రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడని రెండు రోజులు క్రితం వార్తలు వచ్చాయి.
RRRలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అందరు ఇది నిజమే అని నమ్మారు. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు అజయ్ దేవగన్. నేను రాజమౌళి RRRలో నటించడం లేదని,ఈ సినిమాలో నటించమని ఎవరు నన్ను సంప్రదించలేదని చెప్పుకొచ్చాడు. కాని రాజమౌళి సార్ నటించమని కోరితే తప్పకుండా నటిస్తానని తెలిపారు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2లో నటించమని ఆయన కోరారని అజయ్ దేవగన్ పెర్కోన్నారు.
- Advertisement -
RRRపై క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -