బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికర వార్ నడవనుంది. ఈసారి బాక్సాఫీస్ వార్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నందమూరి బాలకృష్ణ మధ్య జరగనుంది. ఈ రెండు సినిమాలపై భారీ హైప్ నెలకొనగా ఎవరిని విజయం వరిస్తుందోనని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు ఉండగా ఇటీవలె హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 26, 2025న గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓజీ రిలీజ్ ఓకే గాని సెప్టెంబర్ 25న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 సైతం రిలీజ్ కానుంది. బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనగా ఇద్దరు అగ్రహీరోల మధ్య వార్ జరగనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.