ప్రపంచ టీ డే..దేశంలోని టీ టూరిజం ప్రదేశాలు ఇవే!

ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వైవిధ్యభరితమైన టీ ఉత్పత్తిదారులలో ఒకటి భారత దేశం. ఇక ఇవాళ ప్రపంచ టీ దినోత్సవం సందర్భంగా దేశంలో టీ ప్రేమికులు తప్పకుండా సందర్శించాల్సిన టీ టూరిజం ప్రదేశాలు ఇవే.

దార్జిలింగ్ టీ రాజధానిగా పిలవబడుతోంది. అలాగే అస్సాంలోని అందమైన టీ తోటలు, నీలగిరి కొండలు, మున్నార్, కేరళ, కాంగ్రా వ్యాలీ, సిక్కిం, కొచ్చి మరియు వెస్ట్రన్ ఘాట్స్ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు. దార్జిలింగ్ టీకి ప్రత్యేకమైన రుచి మరియు వాసన కారణంగా దీనిని చాయ్‌ల రారాజుగా పిలుస్తారు. అస్సాం అంటేనే బలమైన, మాల్టీ టీకి పేరు. జోర్హాట్, తేజ్‌పూర్, నాగావోన్ ప్రాంతాల్లో ఉన్న పాత టీ తోటలను సందర్శించి, టీ తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడొచ్చు. టీ

తమిళనాడులోని నీలగిరి కొండలు పూల పరిమళాలున్న అరొమాటిక్ టీ కోసం ప్రసిద్ధి చెందాయి. ఊటీ, కూనూర్, కోటగిరి వంటి పట్టణాల్లోని తోటలు, గ్లెన్‌మోర్గన్ టీ ఫ్యాక్టరీని సందర్శించండి. మున్నార్ లోని పచ్చని కొండలు విస్తృతమైన టీ తోటలతో నిండి ఉంటాయి. టాటా టీ మ్యూజియంను సందర్శించి కేరళలో టీ చరిత్రను తెలుసుకోండి. అందుకే ఈ ఇంటర్నేషనల్ టీ డేని ఒక కప్పు టీతో ఆనందంగా జరుపుకోండి.