Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో పోర్న్ స్టార్

- Advertisement -

ఇంగ్లీష్ వాడు క్రికెట్ తో పాటు బిగ్ బాస్ ను భారతీయులకు అంటగట్టేశాడు. ఎక్కడో విదేశాల్లో పుట్టి మన దేశంలోని హిందీతో సహా ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ రియాలటీ షో దుమ్ము దులిపేస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2 నడుస్తోంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ 2 ముగియనుంది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 12 హిందీలో మొదలు కాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హిందీ బిగ్ బాస్ ఇంతవరకూ బాగా పాపులర్ అయింది. సీజన్ 12కు కూడా సల్మాన్ ఖానే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతవరకూ ఓకే. కానీ ఇప్పుడు ఓ హాట్ న్యూస్ హిందీ ప్రేక్షకుల్లో హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో టెన్షన్ ను కూడా పెంచేస్తోంది. ఆడవాళ్లు హిందీ బిగ్ బాస్ 12 చూడాలా ? వద్దా ? అనే భయాన్ని కూడా ఆ హాట్ న్యూస్ రేకెత్తిస్తోంది. అంతలా హైప్ క్రియేట్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఆ హాట్ న్యూస్ ఏంటంటే..హిందీ బిగ్ బాస్ 12లో ప్రముఖ బ్రిటిష్ పోర్న్ స్టార్ డేనీ డి కంటెస్టెంట్ గా రాబోతున్నాడని. డేనీ డి అనేక పోర్న్ మూవీల్లో ఏమాత్రం సంకోచం, మొహమాటం లేకుండా నటించాడు. నటిస్తున్నాడు. తన కంటే పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అనే తేడా లేకుండా అనేకమంది మహిళా పోర్న్ స్టార్లతో ఈయన శృంగారం వెలగబెట్టాడు. హై రిజల్యూషన్ కెమేరాల ముందు ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా డేనీ డి రెచ్చిపోయాడు. అతడి పోర్న్ వీడియోలు పదుల సంఖ్యలో నెట్ లో ప్రుస్తుతం హల్చ్ ల్ చేస్తున్నాయి. పూర్తి నగ్నంగా కెమేరాల ముందు ఎలాంటి జంకూ గొంకూ లేకుండా నటించే పోర్న్ స్టార్ అయిన డేనీ డి ఇప్పుడు బిగ్ బాస్ 12 లో కనిపించబోతున్నాడనే సరికి ఓ రకమైన ఆసక్తి అంతటా నెలకొంది. నీలిచిత్రాల్లో నటించడానికే ఏమాత్రం వెనకడుగు వేయని ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఇంకెంత బోల్డుగా ఉంటాడో..? అనే భయం హిందీ బిగ్ బాస్ మహిళా ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇంకో విషయం ఏంటంటే ఇతగాడు పోర్న్ మూవీస్ లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే నటుడే కాదు డైరెక్టర్ కూడా. అంతేకాదు డేనీ డి ఏకంగా అడల్ట్ ప్రొడక్షన్ కంపెనీ చైర్మన్. ఆ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా డేనీ డి బాగానే సంపాదిస్తున్నాడు. అయితే హిందీ బిగ్ బాస్ 12లో తనకు ఆఫర్ వచ్చిందని, తన మేనేజర్ దాని గురించి చర్చలు జరుపుతున్నాడని డేనీ డి చెప్పాడు. అందులోకి కంటెస్టెంట్ గా వెళ్తే కోటి రూపాయల వరకూ భారీ పారితోషికం వచ్చే అవకాశముందని మేనేజర్ చెప్పడంతో, ప్రోఫిట్ వచ్చే చాన్స్ ని నేనెందుకు వదులుకుంటాను. అని డేనీ డి చెప్పుకొచ్చాడు. కొసమెరుపు ఏంటంటే తన భారతీయ గర్ల్ ఫ్రెండ్ ప్రముఖ బాలీవుడ్ నటి, హిందీ సీరియల్స్ నటి అయిన మహికా శర్మ కూడా తనతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు డేనీ డి సిగ్గు పడుతూ చెప్పాడు. మహికా శర్మ పలు హిందీ సినిమాలు, సీరియళ్లలో నటిస్తోంది. ఆమె ఇతగాడి గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైతే ఎంటర్ టైన్ మెంట్ సంగతేమో గానీ, పోర్న్ స్టార్ అయిన డేనీ డి ఎలాంటి వేషాలు వేస్తాడో…అనే ఆసక్తి అంతటా పెరిగిపోయింది. అన్నట్టు సన్నీలియోన్ కూడా హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా రాకముందు పోర్న్ స్టారే. బిగ్ బాస్ తర్వాతే ఆమె బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నటిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -