రాజకీయాల్లోకి రాకముందు కూడా నీతులు చెప్పడం పవన్‌కి బాగా అలవాటే. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక……. మరీ ముఖ్యంగా బాబు సావాసం తర్వాత నుంచీ మాత్రం నీతులు చెప్పడం, గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటైంది. ప్రత్యేక హోదా పోరాటం క్రెడిట్ మొత్తం నాదే అంటాడు. ప్యాకేజ్ కూడా నా గొప్పే అంటాడు. ఇంకా చాలా విషయాల్లో మొత్తం నా వళ్ళే అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇక తాజాగా శ్రీరెడ్డి విషయంలో సీన్‌లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ మీడియా వాళ్ళకు, శ్రీరెడ్డికి కూడా నీతులు చెప్పాడు.
శ్రీరెడ్డికి మీడియాకు ఎక్కాల్సిన అవసరం లేదని….. పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టాల్సిందని, చట్ట ప్రకారం ఏమైనా చేయాల్సిందని సలహా ఇచ్చాడు పవన్. అయితే తాజాగా ఈ విషయంపై రియాక్ట్ అయిన శ్రీరెడ్డి పవన్‌పై దిమ్మతిరిగే స్థాయిలో రియాక్ట్ అయింది. జానీ సినిమా టైంలో పవన్‌పై మీడియాలో విమర్శలు వస్తే సదరు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఆందోళనకు ఎందుకు దిగాడని ప్రశ్నించింది శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆందోళనలు, ధర్నాలు, మీడియా వాళ్ళ ఇంటర్యూలు కాకుండా చట్ట ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చెయ్యొచ్చు కదా అని నిలదీసింది శ్రీరెడ్డి.
మొత్తంగా చూస్తే తనపైన మీడియా ఏవో గాసిప్స్ రాసిందని చెప్పి……సదరు మీడియా కార్యాలయం ముందే జానీ సినిమా టైంలో ధర్నాకు దిగిన పవన్ కళ్యాణ్ చట్టప్రకారం నడుచుకోవచ్చు కదా అని శ్రీరెడ్డికి సలహా ఇచ్చి అన అజ్ఙానాన్ని, అమాయకత్వాన్ని బయటపెట్టుకోవడమే కాకుండా……చెప్పేటందుకే నీతులు ఉన్నాయి టైప్ నాయకుడినే నేను కూడా అని మరోసారి నిరూపించుకున్నాడు పవన్.