వెండితెర దైవంగా భావించే నందమూరి తారక రామారావు జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామారావుగా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఆడియో ఈవెంట్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు షాకిచింది సెన్సార్ బోర్డ్. ఎన్టీఆర్ బయోపిక్ అంటే సినిమాలో చాలామంది గురించి చూపించాల్సి ఉంటుంది. సినిమాలో నటీ,నటులు, రాజకీయ ప్రముఖులు గురించి తప్పనిసరిగా చూపించాలి.
అయితే సినిమా విడుదల తరువాత వారి నుంచి వారి నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండలంటే వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురమ్మని చిత్ర నిర్మాతలను కోరిందట సెన్సార్ బోర్డ్. అయితే ఎప్పుడు ఏ సినిమాకు ఇలా సర్టిఫికెట్ అడగని సెన్సార్ బోర్డ్, మా సినిమాకే ఎందుకు అడుగుతుందని ప్రశ్నిస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇంత మంది దగ్గరకు వెళ్లి సర్టిఫికెట్ ఇవ్వండని అడగడం కూదరదు, కాబట్టి వీరందరికి ఓ స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల మనోహర్ కూడా ఈ సినిమాను మొదట నాకు చూపించి , విడుదల చేయలని అంటున్నారు. మరి ఇటుంవటి పరిస్థితులలో బాలయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
- Advertisement -
‘ఎన్టీఆర్’కి షాకిచ్చిన సెన్సార్ బోర్డ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -