ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్ర ఘట్టాన్నియాత్ర సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ఆర్‌గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి అందరిలో ఓ ప్రశ్న మొదలైంది. వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు.
మరి సినిమాలో చంద్రబాబు గురించి చూపిస్తారా లేదా అనే అనుమానం అందరిలోను నెలకొంది. దీనిపై స్పందించిన చిత్ర దర్శకుడు మాట్లాడుతు తాను అనుకున్న కథకు చంద్రబాబు నాయుడు పాత్ర అవసరం లేదని ,అందుకే తమ సినిమాలో చంద్రబాబు పాత్ర గురించి చూపించలేదని తెలిపాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో వైఎస్ రాజారెడ్డిగా నటుడు జగపతి బాబు నటిస్తుండుగా,సబితా ఇంద్రారెడ్డిగా యాంకర్ అనసూయ నటిస్తుంది. ఈ సినిమాను తెలుగు, మళయాళ భాషలో ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నారు.
- Advertisement -
‘యాత్ర’లో చంద్రబాబు గురించి చూపిస్తారా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -