ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నటి ఇప్పుడు సినిమాలకు దూరమైనట్టు కనిపిస్తోంది. హీరోయిన్‌గా దొంగచూపులతో అలరిస్తూ.. కొంటె చేష్టలతో అల్లరి పిల్ల అనిపించుకున్న చార్మి ప్రస్తుతం సినిమాల్ఓల కనిపించడం లేదు. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అందరి ప్రశంసలు పొందిన ఆ భామ కేవలం పూరి జగన్నాథ్ వద్దే పనిచేస్తోంది. ఇప్పుడు పూరి ప్రొడక్షన్ టీమ్‌లో కో-ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్‌లో సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులను చార్మి దగ్గరుండి చూసుకుంటోంది.
అయితే ఇటీవల చార్మి ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ ఫొటో చూసి చార్మికి ఏమయ్యింది అని అందరూ ప్రశ్నించారు. ఎందుకంటే చేతికి కట్టు కట్టుకొని కనిపించింది. పైసా వసూల్ సినిమాలో ఓ పాత్రలో హీరోయిన్ ముస్కాన్ సేథీ కనిపించింది. ఆమె చార్మికి స్నేహితురాలు. ఇటీవల హైదరాబాద్‌లో ముస్కాన్ ఒక ఫోటోషూట్ నిర్వహించగా ఆమెను కలవడానికి చార్మి వచ్చింది. ఆ సమయంలో తీసుకున్న ఫొటోను ముస్కాన్ సోషల్‌మీడియాలో పెట్టింది. దీంతో
చేతికి కట్టుతో కనిపించడంతో ఛార్మీకి అసలేమైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా గెట్ వెల్ సూన్ మేడమ్ అని కూడా పోస్ట్ చేసింది. మరి ఛార్మీ గాయం వెనుక ఉన్న అసలు కథ ఏంటో? పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందిస్తున్న మెహబూబా సినిమాకు చార్మి పనిచేస్తోంది. గతంలో చార్మి జ్యోతిలక్ష్మి అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసి హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ థియేటర్‌లో కనిపించలేదు.