Thursday, May 16, 2024
- Advertisement -

అది కూడా హిట్టయితే చెర్రీకి కష్టమే

- Advertisement -

ఇంటి పోరు ఫేస్ చేయడం ఎప్పుడైనా.. ఎవరికైనా కష్టమే. అందుకే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇప్పుడు మెగా వారసుడు రామ్ చరణ్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

ఇన్నాళ్లూ మినిమమ్ గ్యారెంటీ హిట్లతో మంచి కలెక్షన్లు సొంతం చేసుకున్న చెర్రీ.. ఇప్పుడు బ్రూస్ లీ సినిమాతో ఒక్కసారి డౌన్ అయిపోయాడు. నైజాం లాంటి ఏరియాల్లో చెర్రీ మార్కెట్ కూడా పడిపోయిందన్నది ఓపెన్ సీక్రెట్.

ఇలాంటి టైమ్ లో.. పంటి కింద నలుసులా.. చెర్రీకి తమ్ముడు వరుణ్ తేజ్ అడ్డు వస్తున్నాడట. కంచె సినిమాతో క్రిటిక్స్ ప్రశంసలతో పాటు.. క్లాసిక్ హిట్ అందుకున్న వరుణ్.. ఇప్పుడు పూరీ డైరెక్షన్ లో లోఫర్ గా తయారవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తో పాటు.. వరుణ్ యాక్షన్ కూ అప్పుడే ప్రశంసలు వస్తున్నాయి. సినిమా హిట్ ఖాయమన్న కాంప్లిమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఇదే.. చెర్రీకి ఇబ్బందిగా మారిందని కొందరంటున్నారు. చిరు 150వ సినిమా పేరుతో పూరీ జగన్నాథ్ తో సంబంధాలు బెడిసి కొట్టడం.. చివరికి పూరీ డైరెక్షన్ లోనే వరుణ్ సినిమా వస్తుండడం కూడా… చెర్రీకి కాస్త కష్టంగా ఉందని తెలుస్తోంది. అందుకే.. చిరంజీవి పర్సనల్ ఫ్యామిలీ.. లోఫర్ ఆడియో రిలీజ్ కు రాలేదని అంతా అనుకుంటున్నారు. ఇవన్నీ.. ఒక ఎత్తయితే.. లోఫర్ సినిమా రిజల్ట్ మరో ఎత్తు అని చెప్పాలి.

ఎందుకంటే.. బ్రూస్ లీ ఫెయిల్యూర్ తో కష్టాల్లో ఉన్న చెర్రీకి.. ఇప్పుడు వరుణ్ లోఫర్ హిట్ అయితే.. ఆ కష్టాలు మరింత పెరగడం ఖాయం. ఎలాంటి డామినేషన్ లేకుండా.. దర్శకుల హీరోగా పేరు తెచ్చుకుంటున్న వరుణ్ కు.. లోఫర్ హిట్టయితే మరిన్ని క్రేజీ చాన్సెస్ వచ్చే చాన్స్ ఉందని చెర్రీ ఆందోళన పడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదే జరిగితే.. అన్నదమ్ముల మధ్య పోటీ ఖాయమని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. చూడాలి. తమ్ముడు వరుణ్ పై అన్న చరణ్ అంచనా ఎంత వరకు నిజమవుతుందో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -