Monday, April 29, 2024
- Advertisement -

సింగర్ మనోపై సంచలన కామెంట్స్ చేసిన చిన్మయి

- Advertisement -

తమిళ మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టు గా ఎంతో పేరు సంపాధించుకున్నారు మనో. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో ఎక్కువ డబ్బింగ్ చెప్పేది మనోనే. ఇక అంతేకాకుండా ఎన్నో పాటలు పాడారు మనో. ఈ మధ్య జబర్దస్త్ లో జడ్జీగా కూడా కనిపించాడు. అలాంటి మనోపై సింగర్ చిన్మాయి షాకింగ్ కామెంట్స్ చేసింది. మనోగారు చాలా అన్యాయంగా మాట్లాడారని తెలిపింది.

విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో జరుగుతున్న డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల్లో చిన్మయి పోటీ చేసేందుకు ఛాన్స్ దక్కలేదు. ఆమె సభ్యత్వంపై కోర్టులో కేసు నడుస్తున్న కారణం చేత ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హురాలు కాదన్నారు. ఇదే టైంలో గతంలో లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ గాయకుడు కార్తిక్ కు యూనియన్ లో చోటు దక్కడంతో చిన్మయి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్తిక్ కు మద్దతుగా మనో ప్రచారం చేయడంపై చిన్మయి కి కోపం వచ్చింది.

దాంతో మనో గురించి ఓ విషయంను సోషల్ మీడియాలో తెలిపింది. కార్తిక్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న అమ్మాయిలను తీసుకుని తన ఇంటికి రమ్మంటూ మనోగారి నుండి కాల్ వచ్చింది. న్యాయం ఏమైనా చేస్తాడేమో అని నేను వారిని వెంట పెట్టుకుని వెళ్లాను. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి. అందరం కింది స్థాయి నుండి వచ్చిన వాళ్లమే. కనుక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలన్నట్లుగా చిన్మయితో మనో అన్నాడట.

కింది స్థాయి నుండి వచ్చినందుకు సింగర్ గా కార్తిక్ అంటే నాకు గౌరవం ఉంది. కాని అతడు పేరు వచ్చిన వెంటనే చేసిన లైంగిక వేదింపుల పై మాత్రం తాను చూస్తూ ఊరుకో లేను అంటూ తాను సమాధానం చెప్పినట్లుగా చిన్మయి చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు మనోపై విమర్శలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -