మైక్ దొరికితే చాలు.. అది సందర్భమా.. కాదా.. అనే విషయం పట్టించుకోకుండా ఏది పడితే అడిగేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. సాధారణంగా సెలబ్రిటీ కార్యక్రమాల్లో.. కొన్ని ప్రశ్నలను అడగద్దంటూ ముందే కొన్ని ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తారు. నిజమైన జర్నలిస్టులు వాటిని కచ్చితంగా ఫాలో అవుతారు కూడా.
రీసెంట్ గా మాటీవీ స్టార్ మాటీవీగా మారుతున్న సందర్భం.. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో ప్రారంభం సందర్భంగా.. మీడియా అడిగిన ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి చాలానే సమాధానాలు ఇచ్చారు. ‘ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్.. ఈ స్టేజ్ సాక్షిగా మీరు ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నిస్తారు’ అని చిరును అఢిగాడు ఓ వ్యక్తి.
దీనికి ‘ఇది నిజంగా అప్రస్తుతం అనకుంటున్నాను. ఇప్పటివరకూ అందరూ మీలో ఎవరు కోటీశ్వరుడుకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. దీని గురించి నేను సమాధానం చెబుతాను. కానీ ఈ వేదిక మీద కాదు. వేరే చోట ఆన్సర్ ఇస్తాను. అయినా పవన్ నా బ్రదర్.. నా బ్లడ్ బ్రదర్’ అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని చిరు ఇచ్చిన ఆన్సర్.. సూపర్ అంతే
Related