Monday, April 29, 2024
- Advertisement -

వాడ్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది… పవన్

- Advertisement -
i was depressed and suicidal pawan kalyans sensational revelation

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పోరాటం ఎలా ఉండాలో తెలుగువారు తమిళుల నుంచి నేర్చుకోవాలన్నారు. జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించినా పోరాడి మరీ తమ సంప్రదాయాన్ని దక్కించుకున్నారని పవన్ ప్రశంసలు గుప్పించారు.

ఈ క్రమంలో తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు పవన్. తన తండ్రి విధుల్లో భాగంగా రెండేళ్లకోసారి బదిలీ అయి వేరే చోటికి వెళుతుంటే, ప్రతి ఊరిలో తమను వేరే వాళ్లుగా చూసేవారని చెప్పుకొచ్చారు. తాను ఏడో తరగతి చదువుతున్న సమయంలో మా అక్కయ్య ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. వచ్చేదారిలో ఎవడో పోకిరి తన చెయ్యిపట్టుకుని వేధించాడని చెప్పింది. ఆ దృశ్యాన్ని ఎందరో చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

కానీ తనకు మాత్రం ఆ దుర్మార్గుడిని చంపేయాలన్నంత కోపం వచ్చిందని పవన్ చెప్పారు. అలాంటి వారిపై చూస్తున్న జనం ఎందుకు స్పందించరనేదేనని పవన్ తెలిపారు. అవినీతి సమాజం, అవినీతి రాజకీయాల వల్లనే ఇలా జరుగుతోందని తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రలోభపెట్టేవారికి చట్టాలు అనుకూలంగా పనిచేయడం దురదృష్టకరం. మన సమాజం మారాలని పవన్ పేర్కొన్నారు.

Related

  1. ముడో భార్యకి కూడా పవన్ విడాకులు ఇవ్వబోతున్నాడా..?
  2. బాహుబలికి షాక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌!
  3. పవన్ పొలిటిక‌ల్ కేరీర్‌ నడిపిస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా..?
  4. పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన వైసీపీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -