Sunday, May 19, 2024
- Advertisement -

అల్లు ఫ్యామిలీతో గొడవపై స్పందించిన మెగాస్టార్..!

- Advertisement -

గతంలో మెగా ఫ్యామిలీ లో మనస్ఫర్థలు ఉన్నాయంటూ చాలా వార్తలే వచ్చాయి. అయితే ఆ వార్తలపై అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ చెక్ పెడుతూ వచ్చింది. ప్రధానంగా చిరు, పవన్ మధ్య దూరం పెరిగిందని పలుసార్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ పుకార్లు పుట్టించిన వారిని కొట్టినట్లుగా మెగా ఫ్యామిలీ ముఖ్యమైన సందర్బం సమయంలో కలుస్తూనే ఉన్నారు. ఇక ఈ మద్య కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు వారి ఫ్యామిలీకి పడటం లేదని రూమర్స్ వచ్చాయి.

తాజాగా చిరంజీవి ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చే సిల్లీ పుకార్ల గురించి స్పందించాల్సిన అవసరమే లేదు. కాని ఫ్యాన్స్ లో గందరగోళం లేకుండా ఉండే ఉద్దేశ్యంతో చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందించారు. గతంలో పవన్ కు నాకు విబేదాలు వచ్చాయంటూ ప్రచారం చేసారు. కానీ పవన్ ఎప్పుడు ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చిన మా ఇంటికి వచ్చి సురేఖ చేతి వంట తింటాడు. ఆ విషయం మీడియాకు తెలియదు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ తో మాకు విభేదాలు అంటూ సృష్టించారు. మేము కుటుంబం అని చెప్పాం అంటే అందులో అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా వస్తుంది.

మేమంతా కూడా ఒక్కటే అంటూ చిరంజీవి అల్లు వారితో ఉన్న గొడవలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. నిన్నటికి నిన్న కూడా చిరంజీవి ట్విట్టర్ లో బన్నీ బర్త్ డే సందర్బంగా ఫొటోను షేర్ చేసి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి నువ్వు బాగుండాలబ్బా అంటూ ఆశీర్వదించిన విషయం తెల్సిందే. ఇంత మంచి సంబంధం ఉండగా కొందరు మాత్రం పుకార్లు పుట్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విబేదాలపై చిరు క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -