- Advertisement -

‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

- Advertisement -

రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్’ వేడుకలో చిరంజీవి పాల్గొని తనయుడి నటనపై ప్రశంసలు కురిపించారు.

ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ, “పెద్దిలో చరణ్ నటించలేదు, జీవించాడు. అందుకే ఇప్పుడు అతడిని చిరంజీవి కాదు, ‘చరణ్‌జీవి’ అని పిలవచ్చు. ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న ఒక కాన్‌క్లేవ్‌లో చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలిచారు. తండ్రిగా బిడ్డలు ఎదుగుతుంటే చూసే ఆనందం అంతా ఇంతా కాదు. రంగస్థలం, పెద్ది చిత్రాల్లో చరణ్ నటన చూసి పుత్రోత్సాహంతో నూటికి నూరు శాతం గర్వపడుతున్నాను” అని అన్నారు.

చరణ్ నటనపై చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడుతూ, “ఎంతో మంది నటులు బాధపడుతూ మనల్ని భావోద్వేగానికి గురిచేస్తారు. కానీ, కళ్లతో నటిస్తూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించగల నటుడు చరణ్. తెరపై చూస్తున్నంత సేపు మాకు చరణ్ కనిపించలేదు, కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు. పాత్రను ఆకళింపు చేసుకుని అందులో లీనమవ్వడం అంటే ఇదే. ఆర్‌ఆర్‌ఆర్, పెద్ది వంటి అరుదైన పాత్రలు చరణ్‌కు ఇంత త్వరగా రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది” అని పేర్కొన్నారు.

చరణ్ పడిన కష్టాన్ని గుర్తు చేస్తూ, “చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. దర్శకుడు చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తే సినిమా హిట్ అవ్వచ్చు. కానీ, పెద్ది విజయం పూర్తిగా చరణ్ వన్‌ మ్యాన్ షో. విరామం లేకుండా జిమ్ కసరత్తులు చేశాడు, గాయపడినా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. నా కెరీర్ తొలినాళ్లలో నేను పడిన కష్టం ఇప్పుడు చరణ్‌లో కనిపిస్తోంది. మేము డబ్బు కోసం, పేరు కోసం సినిమాలు చేయడం లేదు. పని చేయడంలో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటున్నాం” అని చిరంజీవి వివరించారు.

‘మట్టి మనుషుల కథ’ను గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబును, ఈ కథను నమ్మి నిర్మించిన సతీష్ కిలారును చిరంజీవి అభినందించారు. సుకుమార్ విజన్‌ను, బుచ్చిబాబు ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడారు. వేడుకకు హాజరైన సుకుమార్.. #RC17 గురించి అభిమానులు అడగ్గా, దానిని సస్పెన్స్‌గా ఉంచుతూ వెయిట్ చేయమని సూచించారు. ‘పెద్ది’ చిత్ర బృందానికి మరియు ఆదరించిన ప్రేక్షకులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -