Wednesday, April 24, 2024
- Advertisement -

కీర‌వాణి అయినా ఒప్పుకుంటాడో..?

- Advertisement -

మ్యూజిక్ డైరెక్ట‌ర్ వేట‌లో సైరా బృందం

మెగాస్టార్ సినిమా సైరా సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఒక్క మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఫిక్స్ కాలేదు. ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులే ఇంకా ఖ‌రారు కాలేదు. వారిని సంప్ర‌దించ‌క ముందే వారిని వీరిని ఎంపిక చేశామ‌ని, సినిమాలో వారి పాత్ర ఉంద‌ని సైరా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఏ ఆర్ ర‌హ‌మాన్‌తో మ్యూజిక్ అన్నారు. ఆయ‌న డేట్స్ ఖాళీగా లేవ‌ని నిరాక‌రించాడు. ఇంకా న‌టీన‌టుల విష‌యంలో కూడా అదే జ‌రుగుతోంది. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ విష‌యంలో కూడా అదే కొన‌సాగుతోంది. ఆయ‌న్ను అడిగారో లేదో గానీ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నార‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇంకా ఫైన‌ల్ కాలేదు.

ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంపిక మాత్రం రోజుకొక‌రు అంటూ వార్త‌లొస్తున్నాయి. కానీ ఇంకా ఎవ‌ర్నీ ప‌క్క‌గా తీసుకోలేదు. ఏఆర్ ర‌హ‌మాన్ అనుకున్నా అత‌డు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత ఒక‌రిద్ద‌రిని అడిగార‌ట‌. వాళ్ల నిరాక‌రించారు. ఇక సైరా ఫ‌స్ట్‌లుక్‌కు మ్యూజిక్ అందించిన త‌మ‌న్‌ను ఒకే చేశార‌ని టాక్ వచ్చినా ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఎందుకంటే త‌మ‌న్ మ్యూజిక్ సోసో ఉంట‌ది. ఏదో చిన్న సినిమాల కంటే ప‌నికొస్త‌ది. కానీ సైరాను జాతీయ స్థాయి సినిమాగా తీర్చిదిద్దుతుండ‌డంతో ఆ స్థాయి మ్యూజిక్ ఇవ్వ‌లేడ‌ని భావించి వేరొక‌రి వేట‌లో ప‌డ్డారు.

బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ స్థాయిలో ఆడింది. ఆ సినిమా కీర‌వాణి అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూప‌ర్బ్‌. ఆ సినిమా విజ‌యాల‌కు కీర‌వాణి మ్యూజిక్ చాలా ప్ల‌స‌య్యింది. అలాంటి మ్యూజిక్ అందించిన కీర‌వాణిని సైరా సినిమా కోసం అడుగుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం కీర‌వాణి రాజమౌళి సినిమాలు త‌ప్ప వేరే ఏ సినిమాలు చేయ‌డం లేదు. రాజ‌మౌళి త్వ‌ర‌లో చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ తీయ‌బోతున్న మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు కీర‌వాణే సంగీత ద‌ర్శ‌కుడు. అందులో ఎలాంటి సందేహాం లేదు. మ‌రీ ఆ సినిమా మొద‌ల‌య్యే లోపు ఆ సినిమా చేస్తాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -