Friday, May 3, 2024
- Advertisement -

బ‌న్నీ సెట్‌కు వెళ్లిన చిరు

- Advertisement -

అల్లు అర్జున్‌ హీరో గా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ సినిమా సెట్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.సినిమా సెట్‌కు వెళ్లి కాసేపు షూటింగ్‌ను చూసారు. చిరుతోపాటు అల్లు అరవింద్‌ కూడా సెట్‌కు వెళ్లారు. బన్ని, అను ఇమ్మాన్యుయేల్‌ డ్రెస్సింగ్‌, సెట్‌ను బట్టి సినిమాలోని పాట షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్‌ జరుగుతోంది.

ఈ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ షేర్స్ అవుతోంది. ఈ సినిమా కోసం బన్ని ఎంత కష్టపడుతున్నారో టీజర్స్ ను చూస్తే అర్థమవుతోంది. లగడపాటి శిరీషా శ్రీధర్‌, బన్ని వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 4న సినిమా విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -