తెలుగులో మొట్ట మొదటి రియాల్టీ షోగా వచ్చింది బిగ్‌బాస్.ఫస్ట్‌లో ఇలాంటి షోస్ తెలుగులో పెద్దగా ఎవరు పట్టించుకోరని కామెంట్స్ వినిపించాయి.అందరి అంచనాలను తారుమారు చేస్తు బిగ్‌బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.బిగ్‌బాస్ మొదటి సీజన్ ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగింది.అయితే దీనికి విరుద్దంగా బిగ్‌బాస్ రెండో సీజన్ నడుస్తుంది.షో మొదటి రోజే కామన్ మ్యాన్‌ను జైలుకు పంపించి వివాదాలకు తెర లేపింది బిగ్‌బాస్.దీంతో జనాలకు బిగ్‌బాస్‌పై ఆసక్తి పెరిగిపోతుంది. రాత్రి 9:30 అవుతుందంటే చాలు అందరూ టీవీలకు అతుక్కొని ఈరోజు హౌస్ లో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ షోపై తెలుగు కమెడియన్ పృథ్వి సంచలన కామెంట్స్ చేశారు.ఈ షో జనాలను పిచ్చోళ్లను చేస్తుందని,ఇది వారు ఆడే గేమ్,స్క్రిప్ట్ ప్రకారమే షోలోని వారు నటిస్తున్నారని ఆరోపించాడు పృథ్వి . ఈ షోలో నేను కాని, పోసాని కృష్ణమురళి, వంటి వారు ఉంటే అప్పుడు అసలు మజా వస్తుందని ఆయన కామెంట్ చేస్తున్నారు. ‘ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.వాడు గిల్లాడు,వీడు గిచ్చాడని అని షోలో చెప్పుకోవడానికా మీరు అక్కడికి వెళ్లిందని వారిపై ఫైర్ అయ్యాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నాకు హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే లోపలి ఉన్నవాళ్లని కడిగి పారేస్తానని చెప్పుకొచ్చారు కమెడియన్ పృథ్వి.