నవాజుద్దీన్ సిద్దీకి త్వరలోనే తన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కోస్తావ్ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సినిమా మే 1, 2025న జీ5 లో ప్రీమియర్ కానుంది. సేజ్‌ల్ షా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
గోవాకు చెందిన ధైర్యవంతుడైన కస్టమ్స్ ఆఫీసర్ కోస్తావ్ ఫెర్నాండిస్ యొక్క నిజజీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. నవాజుద్దీన్ తో పాటు, ఈ చిత్రంలో ప్రియా బాపట్, కిశోర్ కుమార్ జి, హుస్సేన్ దలాల్, మరియు మహికా శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది.
కోస్తావ్ కు రచయితలు భవేశ్ మండలియా మరియు మేఘ్నా శ్రీవాస్తవ కాగా, నిర్మాతలు వినోద్ భానుశాలి, కమలేశ్ భానుశాలి, భవేశ్ మండలియా, సేజ్‌ల్ షా, శ్యామ్ సుందర్, మరియు ఫైజుద్దీన్ సిద్దీకి. నవాజుద్దీన్ చివరిసారిగా 2024లో వచ్చిన సూపర్‌నాచురల్ హారర్ చిత్రం అద్భుత్ లో కనిపించారు. కోస్తావ్‌తో పాటు నవాజుద్దీన్ ఆదిత్య సర్పోట్డార్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం థమా లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా, పరేశ్ రావల్, మరియు అపర్శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించనున్నారు. థమా అక్టోబర్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.