- Advertisement -

పవన్ ఫ్యాన్స్‌కు నిరాశేనా?

- Advertisement -

జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లో వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం అనేక సందర్భాల్లో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు జూన్ 12న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందనే తెలుస్తోంది.

ఎందుకంటే వీఎఫ్ఎక్స్ పనులు ఇప్పటికి పూర్తికాక పోవడంతో హరిహర వీరమల్లు వాయిదా పడవచ్చని టాక్ నడుస్తోంది. VFX పనులు జూన్ రెండో వారంలో పూర్తయ్యే అవకాశం ఉండటంతో అన్ని పనులు పూర్తైన తర్వాతే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా జూలైలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -