- Advertisement -

రీ రిలీజ్‌లో ‘డార్లింగ్’ జోష్!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మర్చిపోలేని క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్‌లోని అసలైన రొమాంటిక్ యాంగిల్‌ను ఆవిష్కరించిన ఈ చిత్రం, ఇప్పుడు థియేటర్లలో మరోసారి సందడి చేస్తోంది.

దర్శకుడు ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన ‘డార్లింగ్’ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. తాజాగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేయగా, అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలివచ్చారు.

ప్రభాస్ క్రేజ్ ముందు పాత కొత్త అన్న తేడా లేదని ఈ వసూళ్లు నిరూపిస్తున్నాయి. రీ-రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 7.59 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రభాస్‌ను వెండితెరపై ఆ లవర్ బాయ్ లుక్‌లో చూసి ఫ్యాన్స్ పరవశించిపోతున్నారు.

ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా, ప్రభు, తులసి, శ్రద్ధా దాస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో మెరిశారు. ముఖేష్ రిషి ప్రతినాయకుడిగా నటించారు.జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణవాయువు. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతో పాపులర్.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మించబడింది.చాలా కాలం తర్వాత ప్రభాస్‌ను ఇంత రీఫ్రెషింగ్ రోల్‌లో పెద్ద స్క్రీన్‌పై చూస్తుండటంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -