Monday, April 29, 2024
- Advertisement -

‘దసరా’ సినిమా మేకింగ్ వీడియో…

- Advertisement -

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమా ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడుతు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నాని కేరీర్ లోనే హ్యయెస్ట్ అండ్ తొలిసారిగా వంద కోట్లు సాధించిన సినిమాగా ‘దసరా’ నిలిచింది. తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో జరిగిన కథను దర్శకుడు శ్రీకాంత్ అద్బుతంగా చిత్రీకరించారు.

దుమ్ముధూళిలో నేచురల్ లోకేషన్లలోనే సినిమాను షూట్ చేసిన ‘దసరా’ సినిమా మేకింగ్ కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరించిన తీరు, సిబ్బంది శ్రమను చూపించారు. డీగ్లామర్ రోల్ లో నటించిన కీర్తి సురేష్ – నాని మేకప్, లోకేషన్లలో వారు మెదిలిన తీరు కూడా వీడియో కనిపించింది.

ఈ సినిమాలో కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముతిరకణి, సాయి కుమార్, పూర్ణ నటించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించారు. తెలంగాణ, సింగరేణి మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన దసరా సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -