Thursday, May 8, 2025
- Advertisement -

పల్లెటూరు అమ్మాయి బిగ్‌బాస్‌లో ఎలా?

- Advertisement -

ఆమె పక్క ప‌ల్లెటూరు అమ్మాయి. అలాంటి అమ్మాయి యూట్యూబ్ స్టార్‌గా మారింది.త‌నకంటూ అభిమానుల‌ను సంపాదించుకుంది.ఇప్పుడు ఏకంగాబిగ్‌బాస్‌లో ఓ సెల‌బ్రెటీగా ఎంట్రీ ఇచ్చింది.ఆమె ఎవ‌రా!అని అనుకుంటున్నారా? ఆమె దీప్తి సునయన,ప‌ట్టుమ‌ని 20 సంవత్స‌రాలు కూడా లేని ఈ భామకు ఎందుకు అంత క్రేజ్ అంటే…అంద‌మైన రూపంతో పాటు త‌న టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.దీప్తి అబ్బురపరిచే డ్యాన్సులు, అద్బుతమైన డబ్‌స్మాష్‌ విన్యాసాలతో యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌ బుక్‌ల్లో సంచలనం సృష్టించింది.

రంగమ్మ మంగమ్మ ఏంపిల్లడూ… అంటూ సాగే పాటను డబ్‌స్మాష్‌ చేసి తన అద్భుతమైన నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకుల నిరాజనాలను అందుకుంది. కోటీ 23 లక్షల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు. ఆమె ప్రతిభను గుర్తించి బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆమెకు బిగ్‌బాస్‌–2 రియాల్టీషోలో అవకాశం కల్పించారు. దీప్తి సునయన ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ గ్రామ పంచాయతీపరిధిలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన అమ్మాయి.నిఖిల్‌ హీరోగా నటించిన కిరాక్‌ పార్టీ సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా దీప్తి నటించింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌–2 రియల్టీషోలో నటిస్తుండటంతో ఈ ప్రాంతవాసులు ఎంతో గర్వపడుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -