దీప్తి సునైనా..తెలుగు ఇండస్ట్రీలో పరిచియం అక్కరలేని పేరు. ఇండస్ట్రీలో అనే దానికన్నా సోషల్ మీడియా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ఫేమస్ అయింది దీప్తి సునైనా. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ ద్వారానే తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. షో మొదట్లో దీప్తి సునైనాకు వచ్చిన ఓట్లు చేసి షో హోస్ట్‌గా వ్యవహారించిన నాని సైతం ఆశ్చర్యపోయాడు.
తరువాత కాలంలో ఆమె తన ప్రవర్తనతో తీవ్ర విమర్శలను ఫేస్ చేసింది. తనీష్‌తో ఆమె వ్యవహారించిన తీరు చూసి అందరు ఆమెను అసహ్యయించుకున్నారు. దీని కారణంగానే దీప్తి షో నుంచి ఎలిమినేట్ అయిందని చాలామంది అంటుంటారు. ఇక దీప్తి ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన తరువాత పెద్దగా ఎక్కడ బయట కనిపించిన దాఖలాలు లేవు. కారణం ఏమిటో తెలియదు కాని సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించలేదు. ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉండే దీప్తి సైలెంట్‌గా ఉండిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. బిగ్‌బాస్ ద్వారా దీప్తి బాగనే ట్రోల్స్‌ను ఫేస్ చేసింది. వెంటనే సోషల్‌మీడియాలో కనిపిస్తే మరింత ట్రోల్ చేస్తారని భావించిన దీప్తి కొంతకాలం గ్యాప్ తీసుకుంది. తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో ఓ సాంగ్‌కు సంబంధించిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.
తమిళ హీరో ధనుష్, హీరోయిన్ సాయి పల్లవి నటించిన మారీ 2 సినిమాలోని రౌడీ బేబి సాంగ్‌కు స్టెప్పులు వేసింది ఈ బ్యూటీ. ఎంతో సూపర్ హిట్ అయిన్ ఈ సాంగ్‌లో అంతగా మెప్పించలేకపోయింది దీప్తి సునైనా. పాత స్టెప్పులతో నిరాశ పరిచింది.పైగా సాంగ్ ఎడిటింగ్ కూడా ఏమంత బాలేదని యూట్యూబ్‌లో కామెంట్స్ చేయడం కూడా కనిపించింది. ఏది ఏమైనప్పటికి చాలా రోజులు తరువాత దీప్తి సునైనా కనిపించే సరికి ఆమె అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు