Monday, May 6, 2024
- Advertisement -

దేవర గ్లింప్స్‌ రెడీ!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దేవర. శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా న్యూ ఇయర్ ట్రీట్‌గా పార్ట్ 1 గ్లింప్స్‌ను జనవరి 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి కాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో సెకండ్ సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోండగా అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

దేవర పార్ట్ 1 నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ లుక్‌ని కొత్త ఏడాది సందర్భంగా నిర్మాతలు విడుదల చేశారు. అలలతో ఎగిపిపడే సముద్రంలో బోట్‌పైన ఠీవిగా, స్టైల్‌గా నిలుచున్న తారక్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -