Saturday, April 27, 2024
- Advertisement -

దేవీ శ్రీ డ్యాన్స్ కి ప్రభుదేవ ఫిదా!

- Advertisement -

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇటీవలే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి గతంలో వెండితెరపై హీరోగా వస్తారని ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ అది మాత్రం జరగలేదు. అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ లో హీరోలతో కనిపించడం చూస్తూనే ఉన్నాం. దేవీ శ్రీ ఏ చిత్రానికి సంగీతం సమకూర్చినా.. ఆ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్ వర్క్ తో తెగ సందడి చేస్తుంటాడు. దేవి శ్రీ ప్రసాద్ సారథ్యంలో జీ తమిళ్ చానల్ రాక్ స్టార్ అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలో డీఎస్పీ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ ప్రోమోలో దేవీ శ్రీ తన డ్యాన్స్ తో దుమ్మురేపాడు. ఈ ప్రోమో వీడియోలో డీఎస్పీ డ్యాన్సులు అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. దీనిపై దేవి శ్రీ ప్రసాద్ ఓ ట్వీట్ లో వెల్లడించాడు. దేవీ డ్యాన్స్ చూసి ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ ఫిదా అయ్యాడు.

ఈ సందర్భంగా దేవీ మాట్లాడుతూ..  ప్రభుదేవా మాస్టర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తనను థ్రిల్ కు గురిచేసిందని తెలిపాడు. రాక్ స్టార్ ప్రోమో వీడియోలో తాను వేసిన స్టెప్పుల పట్ల ప్రభుదేవా మాస్టర్ ప్రశంసల జల్లు కురిపించారని, అంతకంటే ఇంకేం కావాలని దేవి శ్రీ ప్రసాద్ పేర్కొన్నాడు. ఇలాంటి ప్రశంసలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు అని వివరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -