దర్శకుడు ఆదిత్య దర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కొనసాగిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించి కొత్త రికార్డును సృష్టించింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం నెలకొల్పిన రికార్డును ‘ధురంధర్ 2’ సమం చేసింది. ఆ సినిమా కూడా ఇదే కాల వ్యవధిలో రూ.1000 కోట్ల మార్క్‌ను చేరుకుంది.
ఈ సినిమాలో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు తగ్గకుండా స్థిరంగా కొనసాగడం. ఏడవ రోజు అయిన బుధవారం కూడా సినిమా మంచి కలెక్షన్లు సాధించడం ప్రేక్షకుల ఆసక్తి ఇంకా తగ్గలేదని సూచిస్తోంది. ఇకపై ‘ధురంధర్ 2’ ఎంత దూరం వెళ్తుందో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.
అర్జున్ రాంపాల్, సంజయ్ దత్,మాధవన్, సారా అర్జున్,రాకేశ్ బేడి కీలకపాత్రలో నటించగా ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ నిర్మించగా, సంగీతాన్ని సచ్‌దేవ్ అందించారు.
