Friday, May 3, 2024
- Advertisement -

విజయ్ తెరి చిత్రం తెలుగు లో విడుదల చేయనున్న దిల్ రాజు

- Advertisement -

తమిళ చలన చిత్ర పరిశ్రమ లో నే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ విజయ్ నటించిన తెరి సినిమా ట్రైలర్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు లో  ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి తాను విడుదల చేయనున్నారు.

 

‘రాజా రాణి’ చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

“తుపాకి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాం లో ఉన్న విజయ్ హీరో గా, రాజా రాణి తో మంచి పేరు తెచ్చుకున్న అట్లి దర్శకత్వం లో వస్తోన్న ఈ చిత్రం తెలుగు లో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ఈ చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది “, అని దిల్ రాజు తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం తెలుగు టైటిల్ మరియు తెలుగు ఆడియో వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, సంతానం, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు

దర్శకత్వం – స్క్రీన్ప్లే – అట్లి  .ఫోటోగ్రఫీ – జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్  . సంగీతం – జి . వి . ప్రకాష్ కుమార్.  సహా నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు – రాజు , కలయిపులి ఎస్ థాను 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -