Monday, April 29, 2024
- Advertisement -

నానితో సినిమా చేయ‌నున్న హ‌రీష్ శంక‌ర్‌?

- Advertisement -

డైరక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ‘డీజే సినిమా వ‌చ్చి చాలా కాలం అయిన‌ప్ప‌టికి,ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి సినిమాపై ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు.మ‌ధ్యలో దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా ఉంటుందని ఆ సినిమా ‘దాగుడుమూతలు’ పేరుతో తెరకెక్కే ఇద్దరు యువ హీరోల మల్టిస్టారర్ అని హరీష్ చెప్పినా ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలు ఎక్క‌లేదు.తాజాగా హ‌రీష్ శంక‌ర్ న్యాచుర‌ల్ స్టార్ నానితో ఓ సినిమా చేయ‌నున్నాడ‌నే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికే నానికి క‌థ‌ను వినిపించాడ‌ని,నానికి క‌థ న‌చ్చ‌డం,సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం చకా చ‌కా జ‌రిగిపోయింద‌ని స‌మాచారం.

ఇక ఈ సినిమాను దిల్ కాంపౌండ్‌లో కాకుండా 14 రీల్స్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్‌. 14 రీల్స్ వారు గతంలో నాని హీరో గా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఇది వారికి నానితో సెకండ్ ప్రాజెక్ట్. హరీష్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడట.మ‌రి హ‌రీష్ శంక‌ర్ మాస్ డైర‌క్ట‌ర్‌,నాని మాస్ క్యారెక్ట‌ర్ సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ లేదు.మ‌రి నానిని హ‌రీష్ ఎలా చూపిస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -