యాంకర్ రష్మీ అటు టీవీ షోలు,ఇటు సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.రష్మీ తాజాగా నటించిన చిత్రం అంతకు మంచి విడుదలకు రెడీగా ఉంది.ఇక ఈ సినిమా కన్నా రష్మీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.సినిమా టీజర్ విడుదలైన దగ్గర నుండి రష్మీ హడావిడే ఎక్కువ కనిపిస్తుంది.సినిమాకు రష్మీ అందాలు పెద్ద అసెట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు చిత్ర యూనిట్.తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్.ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకుడు జానీ రష్మీ చేయి పట్టుకుని లాగడంతో,అక్కడ ఉన్న వారంత షాక్ గురైయ్యారు.ఈ వివాదం పెద్దది కాకుండా , ఘటనపై క్లారీటి ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ.
తనకు దర్శకుడికి మధ్య సాన్నిహిత్యం ఎక్కువని,షూటింగ్ టైంలో కూడా ఇద్దరం కథ గురించి ఎక్కువుగా చర్చించుకునే వాళ్లమని, ఆ చనువుతోనే ఆయన నా చేయి పట్టకున్నారు తప్ప మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చింది.దీన్ని దయచేసి ఎవరూ వివాదం చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇక రష్మీ ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందని,తన అందాలను ప్రేక్షకులను ఎరగా చూపించి,వారిని థియోటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తుంది చిత్ర యూనిట్.మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.