బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ రష్మి

- Advertisement -

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది యాంకర్ రష్మీ గౌతమ్. యూత్ లో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఈ అమ్మడు బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా వరుస పెట్టి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ సక్సెస్ మాత్రం ఈ అమ్మడిని పలుకరించలేదు. దాంతో బుల్లితెర బెటర్ అనుకుంది.

తాజాగా రష్మీకి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య గోవాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగా.. రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఇక కరోనా ప్రభావం తగ్గితే రెండో డ్యూల్‌ను జూన్ మూడో వారం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నాగ్ ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనుండగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

- Advertisement -

ఈ సినిమాలో ఓ కీలకమైన పవర్ ఫుల్ పాత్రలో యాంకర్ రష్మీ కూడా నటించనుందని తెలుస్తుంది. అప్పట్లో ప్రవీణ్ సత్తార్ తీసిన గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా నటించగా రష్మీలో నటన తెలిసిన ప్రవీణ్ ఈ సినిమాలో పాత్ర కోసం ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో యాంకర్ అనసూయకు కింగ్ నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటించి బాగా కలిసి వచ్చంది. నాగ్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ హిందీ సినిమాతో పాటు మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలకు సీక్వెల్ చేయనున్నాడు.

జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..

నన్ను నమ్మండి.. నేను నిజంగా రిలేషన్ లో లేను: శ్రీముఖి

హనుమంతుని జన్మస్థలంపై చర్చల్లో ప్రతిష్టంభన!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -