- Advertisement -
రంగస్థలం హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు దర్శకుడు సుకుమార్. ఈ జోష్‌లోనే తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు.మహేష్ బాబుతో తన తరువాత సినిమా ఫిక్స్ చేశాడు సుక్కు. ఈ సినిమా ఆగస్టులో ప్రారంభంకానుంది. సుకుమార్‌కు డిమాండ్ మరింత పెరిగింది.నాన్నకు ప్రేమతో రంగస్థలం హిట్లతో తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడు సుకుమార్.
రంగస్థలం సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబు సినిమాను కూడా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సుకుమార్ 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.దీనికి మైత్రి మూవీ మేకర్స్ ఓకే చెప్పారని సమాచారం.