Wednesday, April 17, 2024
- Advertisement -

సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్న స్టార్ దర్శకుడు

- Advertisement -

గత ఏడాది ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పటిదాకా తన తదుపరి సినిమా ని మొదలు పెట్టలేదు. మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు కానీ ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు సుకుమార్. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.

దీంతో ప్రేక్షకులు తనను మర్చిపోకూడదు అనుకున్నాడో ఏమో కానీ సుకుమార్ స్వయంగా వెండితెరపై కనిపించడం మొదలు పెట్టాడు. ఈ మధ్య పలు సినిమాలలో గెస్ట్ పాత్రలో నటించడానికి సిద్ధం అయ్యాడు సుకుమార్.

ఈ నేపథ్యంలో నిన్న విడుదలైన నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా లో సుకుమార్ ఒక గెస్ట్ పాత్రలో కనిపించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆఖరి లో సుకుమార్ ఎంట్రీ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేస్తుంది. పెన్సిల్ పార్థసారధి (నాని) వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చి తన కథని సినిమా తీస్తానని చెబుతాడు సుకుమార్.

ఇదిలా ఉండగా మరో వైపు మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమాలో కూడా సుకుమార్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డులు ఇచ్చే ఒక్క టీవీ షో కి గెస్ట్ గా సుకుమార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని సమాచారం. ఇక సుకుమార్ అల్లు అర్జున్ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -