మాటల మాత్రింకుడు త్రివిక్రమ్ తన మాటలతో మాయ చేస్తుంటాడు. తన సినిమాలలోని డైలాగులు సినిమా చూసి ఇంటికి వెళ్లిన తరువాత కూడా మనల్ని వెంటాడుతు ఉంటాయి. అందుకే స్టార్ హీరోలు సైతం త్రివిక్రమ్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు.అలాంటి త్రివిక్రమ్ ఓ హీరోయిన్‌పై మోజు పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు .. గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో పోటీ పడి మరి నటించిన హీరోయిన్ రష్మిక మందాన. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కియారా అద్వానీ అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకుందామని భావిస్తున్నాడట త్రివిక్రమ్. కాని బన్ని మాత్రం కియారానే కావాలని పట్టుబడుతున్నాడ. అయితే గీతా గోవిందంలో రష్మిక యాక్షన్ చూసిన దగ్గర నుంచి త్రివిక్రమ్ ఆమెతో ఒక్క సినిమా అయిన చేయలని ఆలోచనలో ఉన్నాడట. అందుకే రష్మికను బన్ని సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఈ వార్తే కనుక నిజం అయితే రష్మిక కెరీర్ దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!