Saturday, May 11, 2024
- Advertisement -

ఆ పేరుతో ఈ స్టార్ దర్శకుడి కి సంబంధం ఏంటి

- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో విక్రమ్ కె.కుమార్ కూడా ఒకరు. సింపుల్ కథలను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విక్రమ్ కుమార్ తనకి తానే సాటి. ’24’, ‘మనం’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే విక్రమ్ కె కుమార్ కి ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటిదాకా తను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ హీరోయిన్ పేరు ప్రియా అనే ఉంటుంది.

అయితే ఎందుకు అలా పెడుతున్నారు? అది తన భార్య పేరా అంటే అది కాదు. మరి విక్రమ్ కుమార్ ప్రతి హీరోయిన్ కి ఎందుకు ప్రియ అనే పేరు పెడతారు అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి. కానీ ఎప్పుడు అడిగినా సరే ఏదో ఒక కథ చెప్పి విక్రమ్ కుమార్ తప్పించుకుంటున్నారు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా లో కూడా ప్రియాంక అరుల్ మోహన్ పేరు ప్రియా అని తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఇప్పుడైనా విక్రమ్ కుమార్ ప్రియా అనే పేరు వెనక ఉన్న మిస్టరీని బయట పెడతాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -