Thursday, May 16, 2024
- Advertisement -

KGFలో అమ్మ‌గా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

ఈ మ‌ధ్య బాహుబ‌లి త‌రువాత అంత‌టి క్రేజ్ తెచ్చుకున్న సినిమా అంటే మాత్రం KGF అనే చెప్పాలి. విడుద‌ల‌కు ముందు ఈ సినిమాపై పెద్ద‌గా ఎవ్వ‌రికి అంచ‌నాలు లేవు. కాని విడుద‌ల త‌రువాత ఈ సినిమా ఎంతటి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా న‌టించిన య‌ష్ ఇప్పుడు నేష‌న‌ల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో న‌టించిన వారంద‌రికి చాలా మంచి పేరు వ‌చ్చింది. KGFలో హీరోగా అమ్మ‌గా న‌టించిన అమ్మాయి గురించి ఇప్పుడు అంద‌రు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అమ్మ క్యారెక్ట‌ర్ కోసం ఓ యంగ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు చిత్ర ద‌ర్శ‌కుడు. KGFలో అమ్మగా క‌నిపించిన అమ్మాయి పేరు అర్చన.

సరిగ్గా 30 సంవ‌త్స‌రాలు కూడా నిండ‌ని ఈ భామ‌ను అమ్మ‌గా చూపించి విజ‌యం సాధించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ .KGFలో అమ్మ సెంటిమెంట్ అంత బాగా రావడానికి అర్చన కూడా ఓ కార‌ణం అని చెప్పాలి. అమ్మ క్యారెక్ట‌ర్‌లో అర్చన అంత బాగా న‌టించింది. అర్చనకు ఇటీవ‌లే పెళ్లి అయింది. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన ఫొటోస్ కోసం నెటిజ‌న్లు బాగా వెత‌క‌డంతో ,కొన్ని ఫోటోల‌ను మీడియాకు విడుద‌ల చేసింది అర్చన. ఈ ఫోటోస్ చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. అసలు ఆమె KGFలో నటించిన అమ్మాయేనా అని కామెంట్స్ చేస్తున్నారు. KGFకు ముందు అర్చ‌న కేవలం రెండు సినిమాల‌లో మాత్ర‌మే న‌టించింది. KGF సెకండ్ పార్ట్‌లో కూడా అమ్మ సెంటిమెంట్‌కి సంబందించిన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -