Thursday, May 16, 2024
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ ని ఫాలో అవ్వకండి: రామ్

- Advertisement -

మరి కొద్దీ గంటల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్ల లోకి రానుంది. ఈ తరుణం లో రామ్ ఇప్పటికే ఆడియన్స్ కి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఈ సినిమా లో ఇస్మార్ట్ శంకర్ పాత్ర ని ఫాలో అవ్వద్దు అని క్లియర్ గా చెప్పాడు. ఈ సందర్భం గా ఈ రోజు కూడా రామ్ ఈ సినిమా ఎవరి కోసం తీయబడించి అనే విషయం పైన క్లారిటీ ఇచ్చాడు.

“ఈ సినిమా ఒక సందేశం ఇవ్వడానికి, జీవితం గురించి చెప్పడానికి అయితే తీయబడలేదు. మీరు ఇస్మార్ట్ శంకర్ ని ఫాలో అవ్వద్దు. వాడు చాలా క్రేజీ మనిషి. ఈ సినిమా ఎమోషన్స్ ని డీప్ గా తీసుకొని ఆలోచించే వాళ్ళ కోసం కూడా తీయబడలేదు. ఈ సినిమా కేవలం మనోరంజకం గా ఉండటానికి, అందరిని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేసాము. మీరు సినిమా చేసేప్పుడు ఆనందం లో సీట్ల లో నుంచి గెంతుతారు. హాయిగా నవ్వుతారు. పాటలని ఆస్వాదిస్తారు. ఒక కొత్త ఎనర్జీ ని కిక్ ని పొందుతారు. తెలుగు సినిమా లో కొద్దీ రోజుల నుంచి అదే మిస్ అవుతుంది. కానీ ఈ సినిమా మీకు దానిని అందిస్తుంది.” అని రామ్ చెప్పాడు.

ఇదంతా చూస్తుంటే, సినిమా చాలా బోల్డ్ గా ఉండబోతుంది, అనవసరం గా ఏదో ఉంటుంది అనుకోని ఇంకేదో ఉంది అని డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలనే ఉదేశ్యం తో రామ్ ఇలా ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నట్టున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -