- Advertisement -
ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన కథానాయకుడు రాజశేఖర్‌కు గతేడాది ‘పీఎస్వీ గరుడ వేగ’తో హిట్ కొట్టారు.అయితే ఈ చిత్రంపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సిటీ సివల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని యూసీఐ తన ఫిర్యాదులో పేర్కొవడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని .తుమ్మలపల్లిలో ఉందన్నారు. విడుదలై ఆరు మాసాలు కావస్తుంటే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.