సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన మంచు మూడో తరం

- Advertisement -

డా. మంచు మోహన్ బాబు మనవరాళ్లు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రంలో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘ఇదే స్నేహం…’ అంటూ సాగే ఈ పాట వీడియోను ఆదివారం (24.7.2022) విడుదల చేసారు. మంచు సిస్టర్స్ పాడిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, తమన్, అచ్చు రాజామణి … సింగర్స్ మనో, గీతామాధురి తదితరులు ఈ మంచు సిస్టర్స్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సంగీత ప్రపంచంలోకి వెల్ కమ్ చెప్పారు.

- Advertisement -

డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జిన్నా’ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -