సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫీసుల్లో ఈడీ ఐదు రోజుల క్రితం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలు పెద్దఎత్తున వెంచర్ ప్రాజెక్టుల పేరిట ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది.
ఇక ఈ సంస్థలకు అంబాసిడర్‌గా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు షాకిచ్చింది ఈడీ. మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ రెండు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మహేశ్ బాబు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారన్న అభియోగంపై ఆయనకు నోటీసులు అందాయి.
సాయిసూర్య డెవలపర్స్ కు చెందిన కంచర్ల సతీశ్ చంద్ర గుప్తా పై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటుడితో ప్రచారం చేయించారని, దీంతో తాము నమ్మామని అన్నారు. 2021లో షాద్‌నగర్‌లోని 14 ఎకరాల స్థలంలో వెంచర్ కోసం రూ.3 కోట్లు కట్టామని చెప్పారు.